బతుకమ్మ, బోధన్ : బోధన్ మండలం భిక్నెల్లి గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికులు బగరే యాదవ్, బగరే బాలాజీ ఇద్దరూ ఇటీవల కరెంట్ స్తంభాలను గ్రామపంచాయతీ ట్రాక్టర్‌లో తీసుకువస్తుండగా జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కష్టసమయంలో బీజేపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అవకాశం లేని పనిని గ్రామపంచాయతీ కార్మికులతో చేయించడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖకు సంబంధించిన కాంట్రాక్టర్ సొంతంగా స్తంభాలను రప్పించి, నిలబెట్టి మరమ్మత్తులు చేయాల్సి ఉండగా, జీపీ కార్మికులతో చేయించడం వలన ఈ ప్రమాదం జరిగిందని ఆయన విమర్శించారు.
