వివేక్ బయోటెక్ కంపెనీ నిర్మాణ పనులు వేగవంతం
ఎల్లారెడ్డి, బతుకమ్మ :సదాశివానగర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో నిర్మిస్తున్న వివేక్ బయోటెక్ కంపెనీ యొక్క పనులు వేగవంతం గా సాగుతున్నాయి.యువతకు 2000 ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు,ఇది స్థానిక రైతంగానికి భారీగా లాభాలు అందించనుంది.అలాగే చుట్టూ పక్కల గ్రామాల అభివృద్ధి కి దోహదపడుతుంది.నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్, అధికారులతో,కంపెనీ యాజమాన్యం తో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ,పనులు సాఫిగా సాగేలా చూస్తున్నారు.