Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 December 2024, 3:59 pm Posted by : ramakrishna

సొంత ఖర్చుతో వాటర్ ట్యాంక్ నిర్మించడం అభినందనీయం 

  • స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి 

భీమ్ గల్, బతుకమ్మ : ఒక్క మారుమూల తాండ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ సొంత ఖర్చుతో తాండవాసులకు మినీ వాటర్ ట్యాంక్ నిర్మించి ఇవ్వడం అభినందనీయమని స్టేట్ కోప్రటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్, డీ సీ సీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. గురువారం  భీంగల్ మండలం దేవకపేట్ గ్రామంలోని హరి సింగ్ తండాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంత ఖర్చుతో నిర్మించిన మినీ వాటర్ ట్యాంక్  ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సామాజిక సేవకు ముందుకు వచ్చిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్,ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్,బీసీ సెల్ అధ్యక్షులు కోరాడి రాజు,ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అరికెల సాయిలు, యువజన మండల అధ్యక్షులు బద్దం అవినాష్,గ్రామ శాఖ అధ్యక్షులు భూక్య తిరుపతి,మండల్ జనరల్ సెక్రెటరీలు రవి,శ్రావణ్,నరసయ్య,అజయ్,మోహన్,మహిళా అధ్యక్షురాలు రాజవ్వ,లక్ష్మణ్ సురేష్,ప్రభాకర్,గోవర్ధన్, గణేష్,సతీష్,ప్రవీణ్,కిసాన్,రాజేశ్వర్,మల్లేష్,దేవక్క పేట గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.