ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బాలికల రెసిడెన్షియల్ పాఠశాల తనిఖీ నిజామాబాద్, బతుకమ్మ : ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలన జరిపారు. గ్రామంలో...