జుక్కల్‌లో ఎస్బీఐ బ్యాంక్ – సొసైటీ కార్యాలయం మధ్య మొరం రోడ్డు ఏర్పాటు
జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండల కేంద్రంలో ఎస్బీఐ బ్యాంక్ నుంచి సొసైటీ కార్యాలయం వరకు ఉన్న దెబ్బతిన్న రహదారిపై గ్రామ సర్పంచ్ సావిత్రి సాయి గౌడ్ ఆధ్వర్యంలో మొరం వేసి రాకపోకలకు అనుకూలంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సర్పంచ్ సావిత్రి సాయి గౌడ్ మాట్లాడుతూ, రోడ్డు అధ్వాన్నంగా ఉండటంతో రైతులు, ప్రజలు, బ్యాంకు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా సొసైటీ కార్యాలయానికి ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం వచ్చే రైతులు, అలాగే ఎస్బీఐ బ్యాంకుకు...