Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 May 2025, 9:20 pm Posted by : ramakrishna

హక్కులను కాపాడుకునేందుకు రాజ్యాంగబద్ధ పోరాటాలు జరుగాలి

 

. . .  హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రఘునాథ్

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

రాజ్యంగంలో మూల సూత్రమైన లౌకికవాదానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం హయంలో ముప్పు ఏర్పడింది. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులను కాపాడుకునేందుకు రాజ్యాంగబద్ధ పోరాటాలు జరుగాలని హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, జాయింట్ యాక్షన్ కమిటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో వక్ప్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 పై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కన్వీనర్ మహ్మద్ అబ్దుల్ అజీం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి  సీనియర్ హైకోర్టు న్యాయవాది, హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రఘునాథ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులు, విధులు అనేది అమలు జరుగడం లేదని పథకం ప్రకారం లౌకికవాదం తెరమరుగు చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. అనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న అమరుల ఆశయాలను క్రోడీకరించి రాజ్యాంగ రచన జరిగిందని  కానీ ఇప్పుడు కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక చట్టాలను చట్ట సభలో అమోదించుకుని వాటిని ప్రజలపై బలవంతంగా రుద్ధే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా  వక్ప్ యాక్ట్ 2025 ఉందని అన్నారు. దీనిపై ప్రజలలో వస్తున్న వ్యతిరేఖతను ఓక వర్గానికి అపాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మనది లౌకిక దేశం అనే భావన ప్రజల నుంచి దూరం చేసే కుట్రలో భాగంగా ఒక సెక్షన్ ప్రజలపై, మరో వర్గం ప్రజలకు మద్య అంతరాలకు ప్రభుత్వం తీసుకుంటున్న విధి విధానాలు కారణం అన్నారు. వక్ప్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 పై జరిగే పోరాటంలో మేదావులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అ బిల్లును వెనక్కి తీసుకోవాలని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని ప్రవేశపెట్టి హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టేలా బిజెపి దేశంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్ని కులాల మధ్య చిచ్చు రేపుతుందన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోర్టులో ఈ బోర్డును అకస్మాత్తుగా చట్టాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సరైన కోర్టు చట్టాలు దేశంలో లేకపోవడం వల్లే దేశంలో ఎంతోమంది యువకులు సమాజానికి పనికి వచ్చే నేతలు ఏళ్ల తరబడిగా జైల్లోనే ఉండి బతుకులను అనుభవిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ముస్లింలందరూ కలిసి ఉండి అన్నదమ్ముళ్ల కలిసివుంటున్న ముస్లిం సోదరులపై కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నడం దారుణం అన్నారు.

Constitutional struggles must be waged to protect rights.

ఈ  రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు భక్తవత్సలం, నరాల రత్నాకర్, ఆకుల పాపయ్య. డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ రవీంద్రనాథ్ సురి, ఉద్యోగ జేఏసీ కన్వీనర్ అలుక కిషన్, గైని భాస్కర్, వాల్ గోట్ రవిందర్, ఎంఐఎం జిల్లా అధ్య క్షుడు ఫయాజ్ అహ్మద్, మల్యాల గోవర్ధన్, నజీబ్ అలీ, అహ్మద్ అలీ ఖాన్, నయిమ్ ఖమర్, సుధాకర్, ఎడ్ల రాము, మాజీ కార్పొరేటర్, నాయకులు, కార్మిక సంఘాల నేతలు తదితరులు పాల్గోని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ప్ బోర్డు చట్టంను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆలీండియా ముస్లీం పర్సనల్ లా బోర్డు అధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు జేఎసీ తరుపును సంపూర్ణ మద్ధత్తు  ప్రకటించారు.

Constitutional struggles must be waged to protect rights.