Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2024, 6:57 pm Posted by : ramakrishna

భారతదేశానికి భారత రాజ్యాంగమే శరణ్యం

తహసీల్దార్ఎం.డి ముజీబ్ 

బతుకమ్మ,మద్నూర్: దేశ పౌరులకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా మద్నూర్ మండల తహసిల్దార్ ఎం డి ముజీబ్ ప్రజలందరికీ “భారత రాజ్యాంగ దినోత్సవ” శుభాకాంక్షలు తెలియజేశారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  మార్గనిర్ధేశనంలో అందించిన రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందాలని ఆకాంక్షిస్తూ మంగళ వారం తహసిల్దార్ కార్యాలయం లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్  చిత్ర పటం వద్ద రాజ్యాంగ పీఠిక చదివి ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల గిర్దవర్ శంకర్, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Constitution of India is the refuge of India