నిజామాబాద్ సిటీ బతుకమ్మ : ఇంట్లో భగవద్గీత, ఖురాన్ ఎలా ఏర్పాటు చేసుకుంటారో ప్రతీ భారతీయుడు తమ ఇంట్లో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని భారతీయ సంవిధాన ప్రచారగ్దల్ అధ్యక్షుడు దేవదాసు అడ్వకేట్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ను భారత పౌరులందరూ విధిగా చదవాలని, అందులో ఉన్న అంశాలను ఇంటింటికీ భారత రాజ్యాంగం ను అందించాల్సిన బాధ్యత ప్రతి భారత దేశ పౌరులపై ఉందన్నారు. అలాగే చట్టాలను రాజ్యాంగం ప్రకారం గా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులు, పాలకుల పైనే ఉందన్నారు. దీన్ని ఒక స్పెషల్ సబ్జెక్టుగా పాఠశాల స్థాయిలో 5వ తరగతి నుండి పదవ తరగతి వరకు దేశమంత అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల్లో బోధించేలా ప్రభుత్వాలు, పాలకులు, అధికారులపై ఉందన్నారు. భారతీయ సంవిధాన ప్రధాన కార్యదర్శి చులక శ్రీనివాస్ రాజ్యాంగాన్ని ఇంటింటికీ తీసుకెళ్లి రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను గుండె గుండెకు రాజ్యాంగం ద్వారా భారత రాజ్యాంగాన్ని ప్రచారం చేయాలన్నారు. దేశంలోని అన్ని వర్గాల వారికి భారత రాజ్యాంగం సమానంగా హక్కులు కల్పించిందని 75 సంవత్సరాల నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రముఖ జర్నలిస్ట్ డి ఎల్ ఎన్ చారి మాట్లాడుతూ రాజ్యాంగంలోని చట్టాలు అన్యాయాలు, అధ్యాయాలు హక్కులు గురించి ఆయన వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ బత్తుల రవి, గుమస్తా సంఘం అధ్యక్షుడు జాడే సంతోష్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.