ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
బతుకమ్మ,వేల్పూర్: వేల్పూర్ మండలంలోని మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులతో ప్రార్థన సమయంలో రాజ్యాంగ పీఠిక పఠనం చేయించారు. విద్యార్థులందరికీ రాజ్యాంగం గురించి వ్యాసరచన పోటీలు, వకృత్వ పోటీలు, డ్రాయింగ్ అండ్ క్విజ్ పోటీలను నిర్వహించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు మానవహారంగా ఏర్పడి రాజ్యాంగం అనే అక్షరాలను ఏర్పరిచారు. ఈ సందర్భంగా రాజ్యాంగ తయారీలో ముఖ్య భూమిక పోషించిన రాజ్యాంగ రచన కర్తలైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్...