Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 November 2024, 5:35 pm Posted by : ramakrishna

నిలకడగా ఎస్సారెస్పీ నీటిమట్టం

బతుకమ్మ మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి ఈ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుండి ఇప్పటివరకు 277.550 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు కాలువల ద్వారా వరద గేట్ల ద్వారా జూన్ 1వ తేదీ నుండి ఇప్పటివరకు 204.449 టిఎంసిల నీటి విడుదల చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉంది ఎక్కువ ప్రాంతాలనుంచి 8596 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది కాలువల ద్వారా 8596 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది కాకతీయ కాలువ ద్వారా 1833 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3250 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 2083 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, లక్ష్మీకాల్వ ద్వారా 150 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.501 టీఎంసీల నీరు నిల్వ ఉంది.