నిలకడగా ఎస్సారెస్పీ నీటిమట్టం
బతుకమ్మ మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉంది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 9454 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. కాలువల ద్వారా బయటికి 9,454 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. కాకతీయ కాలువ ద్వారా 4000 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 4000 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది.1091.00 అడుగులు 80.501 టిఎంసిల నీరు నిల్వ ఉంది.