Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 April 2025, 6:43 pm Posted by : ramakrishna

ధరలు పెంచి సామాన్యులను నిలువు దోపిడీ   

బతుకమ్మ,మోర్తాడ్: సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో  దేశప్రజలపై పెనుభారం మోపుతూ కేంద్రం ప్రభుత్వం పెంచిన పిట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలకు నిరసనగా మోర్తాడ్ మండల కేంద్రంలో. బస్టాండ్ హైవే రోడ్డు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ జిల్లా నాయకులు కిషన్ మాట్లాడుతూ ధరలను పెంచి దేశప్రజలను నట్టేట ముంచాడన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్లుగా సంపన్నులైనా కార్పొరేట్ల కుమ్ముగాస్తు దేశ ప్రజలు ముఖ్యంగా పేదలపై  ధరలు, పన్నులు పెంచి  వాళ్ల వెన్ను వీరుస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు-కుడాయి రేట్లు తగ్గిన ఇక్కడ పెట్టుబడిదారుల కు వత్తాసు పలుకుతూ  పెట్రోల్ వంట గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటు అన్నారు. మతం మత్తులో దేశ ప్రజలను ముంచి తుగ్లక్ ను మించిన మతి లేని పరిపాలన చేస్తున్నాడు అన్నారు. ప్రజల మస్థికాన్ని పక్కదోవపట్టిస్తు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారన్నారు.  ధరలు, నిరుద్యోగం, ఆకలి, పేదరికం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలను పట్టించుకోకుండా, పరిష్కరించకుండ “మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు” ఇట్లా ప్రజలను మరింత భారం వేయడం శోచనీయం అన్నారు.     కేంద్రం పేదల పొట్టకొట్టడం తప్ప పేదలను ఆదుకున్నది లేదు అన్నారు. కోటిశ్వరులకు మేలు చేసేందుకే చమురు – వంట గ్యాస్ లను పెంచి తమ నైజం చాటుకున్నారు అన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు దయాల్సింగ్, దర్శన్ సింగ్, గోవింద్ సింగ్, దశరథ్ గజనాధ్ భూమన్న, ఆటో యూనియన్ ఉపసాధర్ గంగాధర్, భూమన్న, రమేష్, ఆటో చిన్నయ్య, శ్రీనివాస్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.