నిజామాబాద్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట కానిస్టేబుళ్ళ ఆందోళన
నిజామాబాద్, బతుకమ్మ : ఎక్సైజ్ కానిస్టేబుల్ వాహనంతో ఢీకొట్టి ఆసుపత్రి పాలైన సౌమ్యకు న్యాయం జరుగాలంటూ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ కార్యాలయం ఎదుట ఎక్సైజ్ ఉద్యోగులు శనివారం విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. దీంతో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం సాయంత్రం ఎక్సైజ్ టౌన్ సిఐ, ఎస్సైలు తమ సిబ్బంది నిజామాబాద్ పట్టణంలో రూట్ వాచ్ ఆపరేషన్ సమయంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు జరిగిన ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం నగరానికి ఎండుగంజాయి తరలింపు...