Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 April 2025, 10:10 am Posted by : ramakrishna

అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ మృతి

పిట్లం మండలం సిద్ధాపూర్ చెరువు వద్ద మృతదేహం లభ్యం

 పిట్లం, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం సిద్ధాపూర్ చెరువు వద్ద వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన  బుచ్చయ్య (35)  సిద్ధాపూర్ చెరువు కట్ట వద్ద మిగతాజీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బుచ్చయ్య రాత్రివేళ బైక్ పై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యాడా లేక మరేదైనా జరిగి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బైక్ చెట్టును ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పిట్లం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్సై రాజు తెలిపారు. రెండు సంవత్సరాలుగా బుచ్చయ్య పిట్లం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. బుచ్చయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Constable dies under suspicious circumstances