ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 2024 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ జర్కుల సాయికుమార్ పోలీస్ స్టేషన్‌లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి విధుల్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడం స్థానికంగా, పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది. సాయికుమార్ ఆత్మహత్యకు పాల్పడటానికి అసలైన కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే సాయికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించడంపై కుటుంబ సభ్యులు, బంధువులు...