కడ తేర్చాలని కుట్ర పన్ని… కటకటాల వెనక్కి

  బాన్సువాడ, బతుకమ్మ :   పోషించడం భారంగా భావించి సొంత కూతురినే కడతేర్చేందుకు తండ్రి, సవతి తల్లి కుట్ర పన్నారు. ఏడు నెలల చిన్నారిని బ్లేడుతో గాట్లు పెట్టి.. కుక్కలు కరిచాయని కట్టుకథ అల్లారు. ఎట్టకేలకు వారిద్దరు కటకటాల పాలయ్యారు. బీర్కూర్​ మండలంలో జరిగిన ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మేరకు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి సోమవారం వివరాలు వెల్లడించారు. రెండేళ్ల క్రితం సంకు శైలజ భర్త టేకు సతీష్​ను ఆమె చెల్లెలు సంధ్య రెండో వివాహం చేసుకుంది....