వెబ్ న్యూస్, బతుకమ్మ : సింగరేణి బొగ్గు గని కార్మికులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రేశారు. కార్మికుల చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారన్నారు. టీవీకేజీఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ కు కవిత శుభాకాంక్షలు తెలిపారు.
’రాజకీయ కారణాలతో ఈఎన్నిక జరిగిందని, సింగరేణి కార్మికుల కోం పోరాడుతుంటే నాపై కుట్రపన్నుతున్నారు. భారత రాష్ట్ర సమితిలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. నాతండ్రికి రాసిన లేఖను నేను అమెరికా వెళ్లినప్పుడు లీక్ చేశారు. నాపై కుట్రలకు పాల్పడుతున్న వారిని బయటపెట్టాలని కోరితే.. నాపైనే కక్ష కట్టారు.ఆకుట్రదారులు నన్ను వివిధ రూపాల్లో వేధింపులకు గురిచేస్తున్నారు. నేను అమెరికాలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీవీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. టీవీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవిలో ఉన్నా లేకున్నా.. ప్రతి కార్మిక కుటుంబ సభ్యురాలిగా నేను మీ వెన్నంటే ఉంటాను‘. అని కవిత తన లేఖలో పేర్కొన్నారు.
