ముస్లిములను బీసీల్లో చేర్చే కుట్ర

. బీసీలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయం . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్, బతుకమ్మ : ముస్లిములను బీసీల్లో చేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కులగణన గురించి గొప్పగా చెప్పుకుంటూ అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెడుతున్నామంటున్న ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ ఓట్ల కోసం కాంగ్రెస్ చేసిన పెద్ద డ్రామా అని గత...