- ఉపాధ్యాయ ఎమ్మెల్సీలలో అయారాం గయారాంలపై చర్చ
- యూనియన్ అభ్యర్థులను ఓడించేందుకు కోవర్టు రాజకీయాలా
- యూనియన్ లీడర్లను నమ్మలేని పరిస్థితిలో అభ్యర్థులు
- ఎమ్మెల్సీ టికెట్ కు కోట్లు కుమ్మరించిన నాయకులలో అభద్రత భావం
నిజామాబాద్, బతుకమ్మ:
కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు కోలాహలం నెలకొంది. పట్ట భధ్రుల ఎమ్మెల్సీ స్థానం ఫక్తు రాజకీయంగా సాగుతుండగా, అదే కోవలోకి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పయనం కొనసాగుతుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టికేట్ ల కోసమే కోట్లు కుమ్మరించిన వైనం బరిలో దిగిన కోటిశ్వరులు చేస్తున్న ఖర్చును ఉధహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో టిచర్ ఎమ్మెల్సీ టికేట్ ల కోసం ప్రధాన ఉపాధ్యాయ సంఘం కోట్లు తీసుకుని ఇచ్చినట్టు మాజీ పిఆర్ టియు ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎస్ టియు అభ్యర్థి కూర రఘోత్తం రెడ్డి సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంటే పిఆర్ టియులో టికెట్ ల కోసం, పధవులకు డిమాండ్ ఉండగా అక్కడ అంగ, ఆర్థ, సామాజీక(కుల) బలం ఉన్న వారికే అనే అపవాధు ఎప్పటి నుంచో ఉంది. తాజా మాజీ ఎమ్మెల్సీ ఎకంగా పిఆర్ టియు పైననే ఆరోపణలు చేయడం పై ఉపాధ్యాయులు తలోదిక్కున చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా గతంలో పిఆర్ టియులో ఆగ్ర పధవులు అనుభవించిన నేత సైతం ఎమ్మెల్సీ టికేట్ రేసులో ఉన్నప్పటికి యూనియన్ నేతలు అడిగినంత ఇవ్వలేక డ్రాప్ అయ్యాడని ఆ సంఘం నేతలే బహిరంగంగా వాఖ్యానిస్తుండటం కలకలం రేపుతోంది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ముగ్గురు, నలుగురు అభ్యర్ధుల మధ్య పోటీ ఉంది.నాలుగు పాత జిల్లాలో 27 వేల ఓటర్లు ఉండగా అందులో 7 వేలకు పైగా ఓట్లు సాధించిన వారు విజేతలుగా నిలువడం ఖాయమని చెప్పాలి. వాస్తవంగా రాష్ట్రంలో అతి పెద్ధ ఉపాధ్యాయ సంఘంగా పిఆర్ టియుకు పేరుంది. పేరుకు సభ్యత్వాలు అధికంగా ఉన్నప్పటికి ఓట్లకు వచ్చే సరికి ఎక్కడ చిలికలు పేలికలు అవుతాయేనని సంశయాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే టిచర్ యూనియన్ లలో పదవుల కోసం పోటి సర్వసాధరణమైంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలలో యూనియన్ అభ్యర్ధుల ఓటమికి కుట్రలు, కుతంత్రాలు జరిగిన ఉదంతాలు ఉండడం కలవరపెడుతుంది. గత ఏడాది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూనియన్ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి ఓటమి వెనుక పీఆర్ టీయూ నేతలే ఉండడమే ఉదహరిస్తున్నారు.
రాజకీయాలలో నాయకులు గోడ దూకడం సర్వసాధారణం. కానీ ఎన్నికల వేళ టికెట్ల కోసం గోడ దూకిన వారు కొందరైతే తమ ఆధిపత్యాన్న కొనసాగించాలని యూనియన్లు మారిన వారు కొందరు. ఇప్పుడే ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే పీఆర్ టీయూలో గతేడాది జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పీఆర్ టీయూ అభ్యర్థి ఓటమికి కారణమైన వృద్ద నేత చక్రం తిప్పడమే కారణం. ఇదిలా ఉండగా యూనియన్ లు కూడా డబ్బులు తీసుకుని టికెట్లు ఇవ్వడంతో ఈ ఎన్నికల్లో ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తుంది. జంపింగ్ జపాంగ్ ల మాదిరిగా యూనియన్లను మార్చే నాయకులను పక్కన పెట్టుకుని ఎన్నికలకు వెళ్తుండడంతో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లోనూ యూనియన్ నాయకులను నమ్మని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే యూనియన్లకు సంబంధం లేని వ్యక్తులు ఏకంగా టికెట్లు దక్కించుకోవడంతో వారు టీచర్లను కేవలం ఓటర్లుగానే చూస్తారని వారిలోనూ సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఎన్నికల హడావుడి జరుగుతుండగా పంపకాల విషయంలోనూ చర్చ జరుగుతుంది. గెలుపే లక్ష్యంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నోట్లు కుమ్మరించేందుకు సిద్దమౌతుండడంతో ఉపాధ్యాయుల ప్రతినిధులంటే భవిష్యత్తులో రాజకీయ వేత్తలకు ఏ మాత్రం తీసిపోరని టీచర్లు అనుకుంటున్నారు.