- ఎఫ్ఆర్వో రవి మోహన్ బట్
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని గురువారం ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం అడవుల సంరక్షణ మనందరి బాధ్యత అడవులకు నిప్పు మానవాళికి ముప్పు అనే అంశం పైన పారిస్ రేంజ్ కార్యాలయంలో అటవీ శాఖ అధికారులు, అగ్నిమాపక, పంచాయతీ కార్యదర్శులు, వీడీసీ సభ్యులతో ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ బట్ సమావేశం నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు హాజరయ్యారు,అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు మాట్లాడుతూ వేసవికాలం ప్రారంభమైనందున అడవులకు నిప్పు పెట్టడం, అడవుల్లో ఉన్న చెట్లను నరికి వేయడం మానవాళికి ముప్పన్నారు, అడవులను కాపాడుకున్నప్పుడే మానవులు మానవజాతి ఆనందంగా జీవించగలుగుతామన్నారు. చెట్లు ఉండడం వల్లనే ఆక్సిజన్ అందడం వర్షాలు సమృద్ధిగా పడడం జరుగుతుందన్నారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ బట్ మాట్లాడుతూ అడవులకు విప్పి పెట్టడం అడవులను నరికి వేయడం వంటి చర్యలను ప్రజలు మానుకోవాలన్నారు లేని పక్షంలో అటేజ్ సంరక్షణ ఆధ్వర్యంలో కఠినపరమైన చర్యలు తీసుకొని కేసులు చేయడం జరుగుతుందన్నారు. రైతులు వేసుకున్న పంట పొలాలకు చాలావరకు ముప్పు చేకూరి అవకాశం ఉంటుందని అన్నారు. అటవీశాఖ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన అటవీ శాఖకు వెంటనే సమాచారం అందించాలన్నారు దీనిని ప్రజలందరూ గమనించాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్,అటవీ శాఖ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ,పంచాయతీ కార్యదర్శులు ,వివిధ గ్రామాల వీడిసి చైర్మన్ శ్రీపతి జితేందర్,సభ్యులు పాశం శ్రీనివాస్, మద్దెల గంగారాజ్యం,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.