జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. శనివారం ఇన్ చార్జి మంత్రులు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో సమావేశమయ్యారు. ఏఐసీసీ సెక్రెటరీ విశ్వనాథ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి జూబ్లీహిల్స్ ఇన్ చార్జి  చైర్మన్లు పాల్గొన్నారు. ఈఉప ఎన్నికలో అనుసరించే వ్యూహంపై వారు చర్చించారు.  ఈ స్థానాన్ని  కైవసం చేసుకోవాలనే కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. సిట్టింగ్  స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది....