Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2025, 1:42 pm Posted by : ramakrishna

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. శనివారం ఇన్ చార్జి మంత్రులు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో సమావేశమయ్యారు. ఏఐసీసీ సెక్రెటరీ విశ్వనాథ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి జూబ్లీహిల్స్ ఇన్ చార్జి  చైర్మన్లు పాల్గొన్నారు. ఈఉప ఎన్నికలో అనుసరించే వ్యూహంపై వారు చర్చించారు.  ఈ స్థానాన్ని  కైవసం చేసుకోవాలనే కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. సిట్టింగ్  స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అక్టోబర్ లేదా నవంబర్ లో బీహర్ రాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. వాటితో పాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశముంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఈఉపఎన్నిక అనివార్యమైంది.