మైనార్టీలపై కాంగ్రెస్ ది కపట ప్రేమ
హైదరాబాద్, బతుకమ్మ: పార్లమెంట్ లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమని, మైనారిటీలపై కాంగ్రెస్ ది కపట ప్రేమ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రియాంక గాంధీ అతి ముఖ్యమైన ఈ బిల్లు సమయంలో పార్లమెంటుకు హాజరు కాకపోవడం అత్యంత దారుణమన్నారు. కోట్లాది మంది ప్రజలకు సంబంధించి అంశంపై రాహుల్, ప్రియాంక ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ మైనారిటీల హక్కులను కాలరాసే వక్ఫ్...