Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 April 2025, 1:39 pm Posted by : ramakrishna

 మైనార్టీలపై కాంగ్రెస్ ది కపట ప్రేమ

హైదరాబాద్, బతుకమ్మ: పార్లమెంట్ లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమని, మైనారిటీలపై కాంగ్రెస్ ది కపట ప్రేమ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రియాంక గాంధీ అతి ముఖ్యమైన ఈ బిల్లు సమయంలో పార్లమెంటుకు హాజరు కాకపోవడం అత్యంత దారుణమన్నారు.  కోట్లాది మంది ప్రజలకు సంబంధించి అంశంపై రాహుల్, ప్రియాంక ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ మైనారిటీల హక్కులను కాలరాసే వక్ఫ్ చట్టంపై మాట్లాడలేదన్నారు. టోపీలు పెట్టుకొని ఓట్లు దండుకోవడమే వాళ్ల నైజమని విమర్శించారు.