మోర్తాడ్, బతుకమ్మ:కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం పశువుల షెడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ అభివృద్ధి పొలాలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మోర్తాడ్ ఎం పీ డీ వో తిరుమల, ఏ పీ వో శకుంతల, ఏ ఎం సీ డైరెక్టర్ మహిపాల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వైశ్రీ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పుప్పాల అశోక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఆనంద్, గడ్డం అనిల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లడ్డు గంగాధర్, అర్గుల్ రమేష్, జైడి చిన్న గంగారం, కొమీరే శ్రీధర్, నరేష్, మామిడి శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
