Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 7:05 pm Posted by : ramakrishna

నిజామాబాద్ అభివృద్ధే కాంగ్రెస్ ధ్యేయం

. . .  రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 

. . .  రూ. 2 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

నిజామాబాద్ అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నిజామాబాద్ కార్పొరేషన్ లోని గూపన్ పల్లి డివిజన్లో కోటి రూపాయల పనులకు, ముబారక్ నగర్ డివిజన్ మరో కోటి రూపాయల అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. గూపనపల్లి డివిజన్లో సీసీ రోడ్లకు, కల్వర్టులకు, డ్రైనేజీలకు కలిపి కోటి రూపాయలు నిధులతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం గంగస్థాన్ ఫేజ్ 2 లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూపన్ పల్లి డివిజన్ అభివృద్ధికి అన్ని విధాల హామీ ఇచ్చారు. మంచినీటి వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం  భూమిని గ్రామస్తులు సేకరించి, ఇస్తే వెంటనే నిర్మాణం కోసం పనులు చేపడతామని అన్నారు. గంగస్థాన్ ఫేజ్ 2 లో రోడ్లు డ్రైనేజీలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చేపట్టామని అన్నారు. గుపన్ పల్లి డివిజన్ కి ఇప్పటివరకు రూ.6 కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టమని గుర్తు చేశారు. గత ప్రభుత్వం గూపన్ పల్లి ని మర్చిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల్లో గూపన్ పల్లి కి రూ.6 కోట్ల నిధులు అభివృద్ధి చేశామని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి అందుతున్నాయని ఆయన అన్నారు. అనంతరం ముబారక్ నగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన డ్రైనేజీ సిసి రోడ్లు కల్వర్టులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ ప్రియ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ.. ముబారక్ నగర్ డివిజన్ కి ఇప్పటివరకు ఐదు కోట్ల నిధులు మంజూరు చేసి వివిధ రకాల పనులు చేపట్టామని అన్నారు. ప్రస్తుతం కోటి రూపాయలతో ముబారక్ నగర్ లోని లక్ష్మీ ప్రియ నగర్, జనప్రియ నగర్, వివిధ కాలనీలలో సీసీ రోడ్లు కల్వర్టులు డ్రైనేజీ కొరకు కోటి రూపాయల నిధులతో శంకుస్థాపన చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ముబారక్ నగర్ డివిజన్లో అభివృద్ధి పథంలో నడిపించడమే నా ధ్యేయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ప్రతి పేదవాడికి ప్రతి సంక్షేమ పథకం అందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహిళలకు పెద్దపీట వేసిందని, వడ్డీ లేని రుణాలు, అద్దె బస్సులు, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత రేషన్ కార్డు, ఉచిత సన్న బియ్యం ఇస్తున్నామని అన్నారు. లక్ష్మీ ప్రియ నగర్, జనప్రియ నగర్ తారక నగర్ లల్లో రోడ్లు డ్రైనేజీలు వేసామని అన్నారు. త్వరలో నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి, నిజామాబాద్ కార్పొరేషన్ అభివృద్ధికి తోడ్పాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, నిజామాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి అవుతుందని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. సిడిపి నిధులతో 10 లక్షల రూపాయలతో మహిళా భవనం కట్టిస్తానని హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాల్ కు ప్రహరీ కూడా నిర్మిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ కు ఎక్కువ నిదులు ఇచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నిజామాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. నిజామాబాద్ ను స్మార్ట్ సిటీగా నిర్మించేందుకు కృషి చేస్తున్నామని, నిజామాబాద్ చుట్టూ రింగ్ రోడ్ కు ప్రతిపాదనలు పంపించామని అన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ ప్రజలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, పిసిసి డెలికేట్ శేఖర్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, యూత్ నాయకులు నరేష్, గుపన్ పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సందీప్ ముబారక్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిరంజీవి, సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ హనుమండ్లు, మాజీ ఐ సి డి ఎం ఎస్ చైర్మన్  మునిపల్లి సాయిరెడ్డి, లక్ష్మీ ప్రియ నగర్ కాలనీ అధ్యక్షులు రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Congress's goal is the development of Nizamabad
Congress’s goal is the development of Nizamabad
Congress's goal is the development of Nizamabad
Congress’s goal is the development of Nizamabad