Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 5:41 pm Posted by : ramakrishna

అన్ని వర్గాల అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యం

 

. . . డీ డీ సీ ప్రెసిడెంట్ కాటిపెల్లి నగేష్ రెడ్డి

 

భీంగల్, బతుకమ్మ :

 

రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్దిని కాంక్షించి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అన్ని వర్గాల అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యమని డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కాటిపెల్లి నగేష్ రెడ్డి అన్నారు. ఆదివారం  బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపాలిటికీ చెందిన 4వ వార్డు బీజేపీ పార్టీ నాయకులు హరీష్ తన అనుచరులు 30 మంది తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి నగేష్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చూసి వివిధ పార్టీల నుండి నాయకులు చేరుతున్నారన్నారు. పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డిల ఆధ్వర్యంలో భీంగల్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరావేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భీంగల్ మాజీ ఎంపీపీ సురేందర్, బైండ్ల మహేష్, మందుల కిరణ్, గంగాధర్, ప్రితం, ప్రణయ్ గారు, రాములు గారు, గంగాధర్, అశోక్, సురేష్, మహేష్, కిరణ్, బాలయ్య, గంగన్న, బాల గంగాధర్, సాయికిరణ్, నగేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.