తెలంగాణ జల స్ఫూర్తికి కాంగ్రెస్ అపకీర్తి
కేసీఆర్ పై విచారణ రాష్ట్ర ఆత్మగౌరవానికే తలవంపు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రపంచమే అబ్బురపడేలా లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చిన తెలంగాణ జల స్ఫూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం అపకీర్తి తెస్తోందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ సజీవ జల దృశ్యాన్ని అదృశ్యం చేసేలా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, లక్షల కోట్ల రూపాయల...