కాంగ్రెసోళ్లను ఉరికిచ్చి కొట్టాలే..

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రుణ మాఫీ ఇవ్వకుంటే కాంగ్రెసోళ్లను ఉరికిచ్చి కొట్టండంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ, రైతుభరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. రైతుభరోసా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో మానిక్ బండార్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జీవన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మానిక్ బండార్ లో నిరసనకు వేలాది...