Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2025, 9:15 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో మున్సిపాలిటీగా ప్రకటించడంతో బిచ్కుంద లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తులు నియోజక వర్గ అభివృద్ధికి పాటుపడలేదని అందువల్లనే నియోజకవర్గ వెనకబాటుకు గురైందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసమే పాటు పడుతుందని అందులో భాగంగానే బిచ్కుందని మున్సిపాలిటీగా ప్రకటించుకోవడం జరిగిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ఈ సందర్భంతో బిచ్కుంద ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేర్చినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తోట లక్ష్మీ కాంతారావు కృతజ్ఞతలు తెలియజేశారు.