Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 12:54 pm Posted by : ramakrishna

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్

 

. . . 12 వార్డులకు 10 వార్డులను కైవసం చేసుకున్న కాంగ్రెస్

 

. . . ఒక వార్డుతో సరిపెట్టుకున్న బీఆర్ఎస్, ఖాతా తెరవని బీజేపీ

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మున్సిపాలిటిలో ఉన్న 12 వార్డులకు గాను 10 వార్డులలో జయకేతనం ఎగురవేసింది. మున్సిపాలిటిలోని 1వ వార్డులో గాయత్రి తుమ్మల, 2వ వార్డులో మంచిర్యాల మహేశ్వరి, 3వ వార్డులో కౌసర్ ఉన్నిసా, 4వ వార్డులో దుంపల మంజుల, 5వ వార్డులో అట్కారి చంద్రయ్య, 6వ వార్డులో సయ్యద్ గఫర్, 7వ వార్డులో భాగ్యవతి మాత్తమల, 9వ వార్డులో గాజే తిరుపతి, 10వ వార్డులో పద్మ శ్రీకాంత్, 12వ వార్డులో ఎరుకల దశరథం కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచారు. 8వ వార్డులో స్వతంత్య్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్ గెలవగా, 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీ రామగల్ల గెలిచారు. ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.