Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 4:33 pm Posted by : ramakrishna

అభివృద్ధి, సంక్షేమ ఫలాల ఫలితమే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయం

  • పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాల ఫలితమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గ`హంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో మూసీ సుందరీకరణ, ఐటి అభివృద్ధి, మెట్రో రైలుమార్గం పనులపై ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ ఫలితాలు నాంది పలుకుతాయన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలుస్తామనే ధీమాను జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా తెలిపారన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఉప ఎన్నికల గెలుపులో తీవ్రంగా  కృషి చేశారన్నారు. ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీకి ప్రతి కార్యకర్తదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్నారు. అందుకే బీసీ బిడ్డ నవీన్ యాదవ్ కు ప్రజలు కట్టం కట్టారన్నారు. ప్రభుత్వ సంక్షేమం,  అభివృద్ధి పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అందుకే భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గె ఆశయాలను సాధిస్తూ రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. సిట్టింగ్ సీటు కోల్పోయారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు బీఆర్ఎస్ కు గతం తప్ప భవిష్యత్తు లేదన్నారు.  ఈ విలేకరుల సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులున్నారు.