జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు ప్రధాన ప్రతిపక్షాల వైఫల్యమే
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖమ్మం, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ప్రధాన ప్రతిపక్షాల వైఫల్యమేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జనం బాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘వైరా, మధిర, సత్తుపల్లి సహా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు తెలుసుకుంటాం. ఇక్కడి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తాం. హరీష్ రావు మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన వివరణ ఇవ్వాలి....