Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 February 2025, 4:10 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ చీకటి ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: పట్టభద్రులు అంతా ఏకం అయ్యి కాంగ్రెస్ చీకటి ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలో గల ఖలీల్ వాడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి గెలిచినాక రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు గాలికి వదిలి రిటైర్డ్ బినిఫిట్స్ కూడా సరిగా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఒకవైపు నిరుద్యోగతతో  యువత ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లకు పరిమితం అవుతుంటే మరో వైపు రిటైర్మెంట్ కాల పరిమితి పెంచుతు ఉద్యోగులపైన భారం పెంచుతుందన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. 317 జీవోతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే ఉద్యోగుల పక్షాన 317 జీవోకు వ్యతిరేకంగా బిజెపి ఉద్యమం చేపడితే అరెస్తులు, లాఠీ ఛార్జ్ లు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. ఈ కార్యక్రమలోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్, సెక్రటరీ భోజగౌడ్, ట్రెజరర్ ఆశయ్య, రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Congress should teach the dark government