పదవుల పందేరంలో కాంగ్రెస్ సీనియర్లకు షాక్
ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జిల సిఫారసులకు మొండిచేయి పదవుల పంపకాల్లో మారుతున్న రాజకీయ ముఖచిత్రం అనూహ్యంగా నుడా చైర్మన్ పదవి కేశ వేణుకు నిజామాబాద్, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు కొత్త ముఖాలు బతుకమ్మ, నిజామాబాద్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఊసే లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో వినాయక చవితి నాడు రాష్ట్ర పీసీసీ చీఫ్ గా నిజామాబాద్ కు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియామకంతో నిజామాబాద్ జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. మొన్నటి వరకు స్థానిక ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇంచార్జిలు...