మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ నిరసన
హైదరబాద్, బతుకమ్మ : తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించిన తీరుకు నిరసనగా, శనివారం గాంధీ భవన్‌లో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ చైర్మన్ రాచమల్ల సిద్దేశ్వర్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆల్ ఇండియా చైర్మన్ సునీల్ పన్వర్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ హాజరై తమ సంఘీభావాన్ని తెలియజేశారు....