Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 6:04 pm Posted by : ramakrishna

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ నిరసన

 

హైదరబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించిన తీరుకు నిరసనగా, శనివారం గాంధీ భవన్‌లో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ చైర్మన్ రాచమల్ల సిద్దేశ్వర్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆల్ ఇండియా చైర్మన్ సునీల్ పన్వర్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ హాజరై తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ లు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.