కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైయస్సార్ కు ఘనంగా నివాళులు
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు అధ్యక్షతన ఆయన చిత్రపటానికి పూలమాల చేసి కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. ప్రజల మధ్య తేడా చూడకుండా అందరూ...