Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 August 2025, 3:53 pm Posted by : ramakrishna

ఉపాధ్యాయులకు ప్రమోషన్ల ఘనత కాంగ్రెస్ పార్టీదే

  • నుడా చైర్మన్ కేశ వేణు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉపాధ్యాయులకు ప్రమోషన్ల ఘనత కాంగ్రెస్ పార్టీదేనని నుడా చైర్మన్ కేశ వేణు అన్నారు. కేర్ డిగ్రీ కళాశాలలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల గెజిటెడ్ హెడ్ మాస్టర్ గా పదోన్నతులు పొందిన బిసి ఉపాధ్యాయులకు ఆదివారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కేశ వేణు హాజరై మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు లేని సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు ఇస్తున్నామని తెలిపిందన్నారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు దశల వారీగా విడుదల చేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ నిజమైన ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు. పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ బిసి లకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పేర్కొన్నట్లు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, కార్యనిర్వాహక అధ్యక్షులు కంచరి రవికుమార్, కొట్టాల రామకృష్ణ, గౌరవ సలహాదారులు రమణ స్వామి, కొట్టూరు రమేష్, సత్యనారాయణ, ఉపాధ్యక్షులు యు. విజయ్ కుమార్, రామకృష్ణ, శంకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Congress party takes credit for promotions for teachers