Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 June 2025, 6:07 pm Posted by : ramakrishna

బోధన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుల రాజీనామా

 బతుకమ్మ, బోధన్: శనివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో బోధన్ శాసన సభ్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి చోటు లభించకపోవడం పై తీవ్ర అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామా చేశారు. ఈ నిరసనలో భాగంగా బోధన్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డి కి వెంటనే మంత్రి పదవి ఇవ్వకపోతే, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉండదని పార్టీ నాయకులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర  కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ కు ఈ రాజీనామా పత్రాలు సమర్పించారు. పొద్దుటూరి సుదర్శన్ కు మంత్రి పదవి దక్కకపోవడంతో బోధన్ నియోజక వర్గ కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం బంద్ ప్రకటించగా కొన్ని అనివార్య కారణాల వల్ల  బంద్ ను వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు.