ఎల్లారెడ్డి లో కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన
ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.శాసనసభ స్పీకర్ పై బి ఆర్ ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టినట్లు వారు తెలిపారు.అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ కురుమ సాయిబాబా,మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం, మాజీ జెడ్పిటిసి సామెల్,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.