Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 August 2025, 7:54 pm Posted by : ramakrishna

తెగిపోయిన రోడ్డును పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర – రామలక్ష్మణ పల్లి గ్రామాల మధ్యన తెగిపోయిన రోడ్డు కాజ్  వే ను ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్ కే సాబేరా బేగం,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య లు మాట్లాడారు. ఎల్లారెడ్డిపేట మండలం నుండి ముస్తాబాద్ మండలానికి నేరుగా ఉన్న ఈ రోడ్డు తెగిపోవడం మూలంగా ప్రజలకు ఇబ్బంది ఏర్పడిందని అన్నారు.సిరిసిల్ల నియోజకవర్గం  ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. వెంటనే ఆర్ అండ్ బి ఈ  ఈ ఎస్టిమేషన్ వేసి పంపించడం జరిగిందన్నారు.నాలుగు రోజులలో తాత్కాలిక రోడ్డు నిర్మాణానికి పని ప్రారంభమవుతుందని అన్నారు. రానున్న కాలంలో ఇలాంటి ఇబ్బందులు మరోమారు పునరావృతం కాకుండా లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి,  నాయకులు చెన్ని బాబు,చెరుకు ఎల్లయ్య,పందిర్ల శ్రీనివాస్, మెండే శ్రీనివాస్,సురేందర్,గోపాల్, బండారి బాల్ రెడ్డి ,కల్లూరు బాపురెడ్డి, గంట బుచ్చగౌడ్,కంచర్ల శ్రీనివాస్,లాల్ మొహమ్మద్,కంచర్ల రాజు తదితరులు పాల్గొన్నారు.