Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 7:00 pm Posted by : ramakrishna

మహిళ రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు

 

. . . ఆ పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకం

 

. . . జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ కు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు అని, మహిళా రిజర్వేషన్ పేరుతో బిజెపి చేస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు మాత్రమే వ్యతిరేకమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్నారు. మహిళ రిజర్వేషన్ పైన బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్ భవన్ లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం బిజెపి చేస్తుందని, 2023లో మహిళ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపిందని అన్నారు. బిజెపికి మహిళలపై చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్న 543 పార్లమెంటు స్థానాలలో మహిళ రిజర్వేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 543 పార్లమెంట్ స్థానాలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే విధంగా బిల్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందని, అంతే గాని కుట్రలు చేస్తూ రాజ్యాంగాన్ని ఖూనీ చేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని, బిజెపి ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని అంతే కానీ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని నగేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుతో బిజెపి ప్రభుత్వం దేశాన్ని బలహీనం చేసే విధంగా కుట్రలు చేస్తున్న విధానాన్ని గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతా రెడ్డి రాజారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి భక్తవస్థలం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కౌడపు శరత్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేంద్ర గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రఘు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకులు అపర్ణ, తదితరులు పాల్గొన్నారు.

 

Congress party is not against women's reservation