సిగ్మా హాస్పిటల్ ను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని సిగ్మా హాస్పిటల్ ను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డికి నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సిగ్మా హాస్పిటల్ చైర్మన్ గడిల రాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సిగ్మా హాస్పిటల్ డైరెక్టర్ వెల్మల్ గోపి స్వాగతం పలికి పుష్ప గుచ్ఛం ఇచ్చి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన...