Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 October 2024, 8:39 pm Posted by : ramakrishna

సిగ్మా హాస్పిటల్ ను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని సిగ్మా హాస్పిటల్ ను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డికి నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సిగ్మా హాస్పిటల్ చైర్మన్ గడిల రాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సిగ్మా హాస్పిటల్ డైరెక్టర్ వెల్మల్ గోపి స్వాగతం పలికి  పుష్ప గుచ్ఛం ఇచ్చి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మారంపల్లి లిఫ్ట్ చైర్మన్ భోజ రెడ్డి, డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి, ఆర్మూర్ పట్టణ కౌన్సిలర్లు రవి గౌడ్, లింబాద్రి గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రవీందర్ రెడ్డి, రాజు భాయ్, నటరాజ్ పాల్గొన్నారు.