Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 December 2024, 4:56 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల గారడి

మాజీ ఎమ్మెల్యే అరుణ తార 
బతుకమ్మ జుక్కల్ :  కాంగ్రెస్  పార్టీ ఆరు గ్యారెంటీలతో గారడి చేసి అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే అరుణతారా అన్నారు.  జుక్కల్ మండల కేంద్రంలో గురువారం అంబేద్కర్ చౌరస్తాలో గురువారం నిర్వహించిన బిజెపి కార్యకర్తల సమావేశంలో మాజీ జుక్కల్ ఎమ్మెల్యే అరుణ తార మాట్లాడారు. కార్యకర్తలు సైనికుల పనిచేయాలని ఆమె పేర్కొన్నారు.  ఆరు అబద్ధాలు… 66 మోసాలు చేశారని బిజెపి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి అని మోసం ఆడబిడ్డలకు ప్రతి నెల అందని రూ.2,500 ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నారు. అరకొరగా రూ.500కే సిలిండర్ రాయితీ ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ మండలాధ్యక్షులు శివాజీ పటేల్, ప్రెసిడెంట్ పటేల్ వారు మారుతి, మాధవ, మాధవరావు, దేశాయ్, ఆయిల్ వారి మారుతి, రామ్ పటేల్, తుకారం పటేల్, రామారావు, బాబు జీవన్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Congress party guarantees juggling act