రుద్రూర్ లో బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు
రుద్రూర్, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని బీసీ జేఏసీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం రుద్రూర్ మండల కేంద్రంలో శనివారం బంద్ పాటించారు. వ్యాపార సముదాయాలు, వ్యాపారస్తులు బంద్ కు సహకరించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. బీసీలకు అనగదొక్కే ఏపార్టీ అయినా రానున్న స్థానిక ఎన్నికల్లో ఓట్ల రూపంలో బీసీలు గట్టి బుద్ధి చెప్తారని ఆయన తెలిపారు. అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపి పార్టీ నాయకులు బైక్...