. . . హైదరాబాద్ – మహబూబ్ నగర్ కి సామా రాంమోహన్ రెడ్డి
. . . నల్గొండ – వరంగల్ కు సర్వోత్తం రెడ్డి
. . . సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వారికే ఎమ్మెల్సీ టికెట్ లు
హైదరాబాద్, బతుకమ్మ :
కాంగ్రెస్ పార్టీ తరుపున రాష్ట్రం లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గా బరిలో నిలిచే ఇద్దరు అభ్యర్థులు ఖరారు అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన లో ఉండగానే ఎఐసీసీ ఇద్దరు కాండిడేట్స్ లను ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి గా సామరాం మోహన్ రెడ్డి,నల్గొండ, ఖమ్మం, వరంగల్ అభ్యర్తిగా రాం రెడ్డి సర్వోత్తం రెడ్డి ల పేర్లను ప్రకటించింది. రాష్ట్రం లో త్వరలో జరుగనున్న పట్ట భద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశలు పెట్టుకున్న వారి ఆశలు గల్లంతు అయ్యాయి. ఇద్దరు రెడ్డి సామజిక వర్గం కు చెందిన వారికే సీట్లు ధక్కాయి. అధికార పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ను ప్రతిష్టత్మకంగా తీసుకుంది. ఒకేసారి ఖైరతాబాద్ ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
