కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ కారుకు ప్రమాదం

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ కారుకు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు జంక్షన్ వద్ద తెల్లవారుజామున కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎంను బల్మూరి వెంకట్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బల్మూరి వెంకట్ దంపతులు బయటపడ్డారు.