ఏర్గట్ల, బతుకమ్మ :
సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో గల ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమం, అలాగే రైతు భరోసా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ నాయకులు వీక్షించారు. ఏర్గట్ల మండల కేంద్రం లోని రైతు వేదిక సమావేశ హాల్ లో మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.